కూటమి ప్రభుత్వం పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశానుసారం పట్టణ పరిధిలోని డ్రైనేజ్ పూడికతీత పనులను మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో కనీస మరమ్మత్తులు నోచుకోకుండా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.