మంచినీటి కోసం అల్లాడుతున్న గ్రామస్థులు

మంచినీటి కోసం అల్లాడుతున్న గ్రామస్థులు

SRD: కంది మండలంలోని ఎర్దనూర్, ఎర్దనూర్ తాండాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. నెల రోజులుగా మిషన్ భగీరథ నీరు అందక గ్రామస్తులు అల్లాడుతున్నారు. ఎండలు దంచికొడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇతర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.