చిట్యాల నూతన తహసీల్దారుగా విజయ్ కుమార్

చిట్యాల నూతన తహసీల్దారుగా విజయ్ కుమార్

NLG: చిట్యాల మండల నూతన తహసీల్దార్‌గా ఎం.విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. నల్లగొండ కలెక్టరేట్ రెవెన్యూ విభాగం నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి పూలమొక్కతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా చేరువ చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.