రైల్వే జోన్ ఇంకెంత దూరం..!

VSP: మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశం మళ్లీ తెరమీదకు వస్తోంది. రాష్ట్రంలో భారీ మెజారిటీతో ‘కూటమి’ పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారంతా రైల్వే జోన్ అంశంపై తరుచూ మాట్లాడడంతో ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చింది.