VIDEO: కుల్దీప్, రోహిత్ మధ్య సరదా సన్నివేశం
విశాఖ వన్డేలో కుల్దీప్ యాదవ్, రోహిత్ శర్మ మధ్య సరదా సన్నివేశం చోటుచేసుకుంది. బ్యాటర్ ప్యాడ్స్‌కు బంతి తగిలిన ప్రతిసారీ అది ఖచ్చితంగా ఔటే అని కుల్దీప్, రోహిత్‌ను DRS తీసుకోమని కోరడం.. దానికి రోహిత్ నవ్వుతూ, అది తప్పుడు నిర్ణయం అని చెప్పడం అందరికీ నవ్వు తెప్పించింది. దీనిపై కుల్దీప్ స్పందిస్తూ.. DRS విషయంలో తను ఎప్పుడు గందరగోళానికి గురవుతానని చెప్పుకొచ్చాడు.