జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు
ASR: సీతారామరాజు జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు, చింతపల్లి, అరకు డివిజన్ల పరిధిలో ఈనెల 5వ తేదీ వరకు కనిష్ఠంగా 0.2 మిల్లీమీటర్ల నుంచి గరిష్ఠంగా 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందన్నారు.