దుప్పలపూడిలో మాజీ ఎమ్మెల్యే విగ్రహావిష్కరణ
E.G: అనపర్తి మండలం దుప్పలపూడిలో ఆగస్టు 1న జరగనున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఆగస్టు 1న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.