కందుకూరులో రూ.225 కోట్ల సౌర విద్యుత్ పథకం
NLR: కందుకూరు నియోజకవర్గంలో రూ.225 కోట్లతో సౌర విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు MLA ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 18,830 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడతలో 2,619 ఇళ్లకు సౌర సదుపాయం అందించనున్నారు. వివిధ మండలాల్లో లబ్ధిదారులను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గనున్నాయని చెప్పుకొచ్చారు.