తాండూరులో వినూత్నంగా వృక్షాబంధన్

VKB: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ రోజు తాండూరులో వినూత్నంగా వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ ఆధ్వర్యంలో వృక్షా బంధన్ ద్వారా చెట్టుకు రాఖీ కట్టారు. స్థానిక మహిళలతో కలిసి చెట్టుకు ఆమె రాఖీలు కట్టించారు. అనంతరం చెట్టుకు పూజలు నిర్వహించారు.