VIDEO: బోనాలతో ఆకట్టుకున్న నృత్యం

VIDEO: బోనాలతో ఆకట్టుకున్న నృత్యం

RR: షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం శేరిగూడ గ్రామంలో శుక్రవారం వైభవంగా బోనాలను నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తరలి వెళ్లి బోనాలను సమర్పించారు. గ్రామంలో అందరూ కలిసి ఐక్యమత్యంతో బోనాల ఊరేగింపులో పాల్గొనడంతో మరింత విశిష్టత సంతరించుకుంది. ఈ సందర్భంగా బోనాలను ఎత్తుకొని చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.