దశమి పూజలందుకున్న పార్వతిసంగమేశ్వర స్వామి

దశమి పూజలందుకున్న పార్వతిసంగమేశ్వర స్వామి

SRD: తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో బుధవారం సంగమేశ్వర స్వామి ప్రత్యేక పూజల్లో దివ్య దర్శనమిచ్చారు. వైశాఖమాసం, శుక్లపక్షం, దశమి, పుబ్బ నక్షత్రం సౌమ్య వాసరే పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు, గంగాజలం, పుష్పార్చన చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.