నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

విశాఖ: గొలుగొండ మండలంలో 33 కెవి లైన్‌లో రిపేర్ కారణంగా నేడు శనివారం ఉదయం 8 గంటల నుండి కరెంటు సప్లై నిలిపివేస్తున్నామని డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో చిడిగుమ్మల, ఎర్రవరం, జోగంపేట, గొలుగొండ, కొత్తమల్లంపేట తదితర గ్రామాలకు కరెంటు ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.