'అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని వినతి'

ADB: పట్టణంలోని రాణి సతిజి కాలనీలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్యాల మనోజ్ కుమార్ కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజును కలిసి గురువారం వినతి పత్రం అందజేశారు. రోడ్డుపైకి వచ్చేలా ఇళ్ల నిర్మాణాలను చేపట్టడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.