అర్బన్ కాలనీలో డిగ్రీ విద్యార్థుల స్వచ్ఛ భారత్

JGL: జగిత్యాల SKNR, మహిక డిగ్రీ కళాశాల NCC, NSS విద్యార్థులు సోమవారం నూకపల్లి అర్బన్ కాలనీలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న గడ్డి, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు. తడి, పొడి చెత్త వేరుచేయాలని, డస్ట్ బిన్లు వాడాలని, నీటి నిలువ ఉండకుండా చూసుకోవాలని గృహ యాజమానులకు సూచించారు.