రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 'సిక్కిం.. నిర్మలమైన ప్రకృతి అందం, గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలు, శ్రమజీవులతో ముడిపడి ఉంది. రాష్ట్రం విభిన్న రంగాలలో పురోగతి సాధించింది. ఈ అందమైన రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతూనే ఉండాలని కోరుకుంటున్నాను' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.