VIDEO: ఘనంగా రంగనాయకుడి తెప్పోత్సవం

VIDEO: ఘనంగా రంగనాయకుడి తెప్పోత్సవం

ప్రకాశం: రాచర్ల మండలంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం రంగనాయకుడి తెప్పోత్సవం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.