ఘనంగా శ్రీఊరమ్మ తల్లి ఉత్సవాలు

SKLM: పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామంలో శ్రీ ఊరమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అమ్మవారిని దర్శించుకుని, పూజలు చేపట్టారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.