ఉదయం 20 నిమిషాలు చాలు

ఉదయం 20 నిమిషాలు చాలు

ఉదయం లేవగానే చేయగలిగే అత్యంత సులువైన, ఆరోగ్యకరమైన పని.. సూర్యరశ్మిని పొందడం. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఉండే లేత సూర్యరశ్మిలో 15 - 20 నిమిషాలు గడపడం వల్ల మన శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్-D లభిస్తుంది. ఇది ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. అలాగే, ఇది రోగనిరోధక శక్తిని పెంచి, అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.