'శాశ్వత హెచ్‌ఎంను నియమించాలి'
NLG: చిట్యాల మండలం, వెలిమినేడు ZPHS పాఠశాలలో గత 6 నెలలుగా శాశ్వత హెడ్‌మాస్టర్ లేకపోవడంపై బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ అంశల అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జ్ వ్యవస్థతో పాఠశాలను నడపడం విద్యార్థుల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడమేనని విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత హెచ్‌ఎంను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.