రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

VZM: బొండపల్లి మండలంలోని గొట్లాం బైపాస్ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గజపతినగరానికి చెందిన బూసాలే బాలు స్కూటీపై గజపతినగరం నుంచి విజయనగరం వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ప్రమాదం సంభవించింది. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.