ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉద్రిక్తత

ASF: ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జీవో 49 రద్దు చేయాలంటూ 4 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఇంటికి అధికారులు, వైద్యులు చేరుకుంటున్నారు. అయితే వారిని బీజేపీ కార్యకర్తలు లోపలికి రాకుండా ఇంటికి తాళం వేసి అడ్డుకుంటున్నారు.