స్వదేశానికి 2.44 లక్షల మంది భారతీయులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు భారతీయులు మృతి చెందినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. మరొకరు గల్లంతైనట్లు తెలిపింది. ఒమన్ సోహర్ నగరంలో మరణించిన ఇద్దరు భారతీయుల భౌతికకాయాలను ఇప్పటికే జైపూర్‌లోని వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపింది. అలాగే ఫిబ్రవరి 28 నుంచి నేటి వరకు 2.44 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు పేర్కొంది.