రేపు ఇల్లందు మండలంలో పర్యటించనున్న మంత్రి

BDK: ఇల్లందు మండలంలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పురం కనకయ్య పర్యటించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా సుభాష్ నగర్ జీపీలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన, జేకే కాలనీ మినీ స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు, మిత్ర పక్షాల నాయకులు, అధికారులు సకాలంలో హాజరవాలన్నారు.