ఉక్రెయిన్‌కు ట్రంప్ షాక్!
ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం 28 పాయింట్లతో కూడిన ప్లాన్‌ను ట్రంప్ సిద్ధం చేశారు. ఈ పాయింట్లు ఉక్రెయిన్‌కు అనుకూలంగా కాకుండా రష్యాకు మద్దతుగా ఉన్నాయని సమాచారం. దీంతో వీటిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యతిరేకించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.