రాజరాజేశ్వరిగా దర్శనమివ్వనున్న శ్రీశైలం అమ్మవారు
NDL: శ్రీశైల క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి, అమ్మవారు రమావాణీ సమేత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తారు. భ్రమరాంబికా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.