రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
NLG: కనగల్ మండలం ధర్వేశిపురం, పర్వతగిరి గ్రామాల శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారికి ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి ప్రాతః కాలంలో నిజ అభిషేకం, అలంకరణ చేసి భక్తులకి దర్శనం కల్పించారు. మహిళా భక్తులు కుంకుమార్చనలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తీర్ద ప్రసాదం అందచేశారు.