రేపు గుంటూరులో జగన్ పర్యటన
GNTR: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరులో పర్యటించనున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఒక కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్, దువా కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు.