డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం
RR: నందిగామలోని మోత్కులగూడలో సర్పంచ్ లావణ్య రమేశ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం అత్యంత అవసరమని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.