వైభవంగా లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కళ్యాణం

KMM: కూసుమంచి మండలం ధర్మ తండాలో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, గౌరీ పూజ అనంతరం జిలకర బెల్లం కళ్యాణం నిర్వహించారు. పూజారి స్వామినాథన్, దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.