హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు

హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన హరీష్ రావు

TG: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కాళేశ్వరంపై ఎల్లుండి హైకోర్టు తీర్పు నేపథ్యంలో లాయర్లతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. హరీష్ రావు వెంట మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు. జగిత్యాలలో కేసీఆర్ సభ సమయంలో హరీష్ రావు ఢిల్లీ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.