వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
VZM: ఎస్.కోట మండలంలో వ్యవసాయ సిబ్బందికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా వినాయకపల్లి గ్రామంలో కేడర్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ప్రకృతి వ్యవసాయంలో మెళుకువలు, పీఎండీఎస్ నవధాన్యాల సాగుపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా నేల నాణ్యతను పెంచుతూ ఎస్-2 స్థాయి నుంచి ఎస్-1 స్థాయికి ఎలా మార్చాలనే అంశంపై విస్తృతంగా వివరించారు.