అందరూ 3 డోసుల వ్యాక్సిన్ తీసుకోండి..!
HYD జిల్లా పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు సేవలందించే వైద్యులు, సిబ్బంది రక్షణ కోసం కాలేయ వ్యాధికి కారణమయ్యే హెపటైటిస్–బి వైరస్‌కు వ్యతిరేకంగా టీకా పంపిణీ చేపట్టింది. జిల్లాలో మొదట వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి టీకా తీసుకున్నారు. జిల్లాలో 91 ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర సిబ్బంది 3 డోసులు తీసుకోవాలని సూచించారు.