విద్యుత్ షాక్.. ఒకరికి తీవ్ర గాయాలు

విద్యుత్ షాక్.. ఒకరికి తీవ్ర గాయాలు

TPT: రామచంద్రపురం మండలంలో విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి రూరల్ పేరూరు పంచాయతీ హరిపురం కాలనీకి చెందిన కేశవ (26) రామచంద్రపురం మండలం కేంద్రంలో ఓ ఇంటికి ఎలక్ట్రిషన్ చేయడానికి వచ్చారు. పనిచేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.