ఆటో ఢీ కొని అరసవిల్లి వాసి మృతి

ఆటో ఢీ కొని అరసవిల్లి వాసి మృతి

SKLM: గార మండలం అంపోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన జరిగింది. అంపోలు జంక్షన్ చల్లపేట వద్ద గురువారం సాయంత్రం అరసవిల్లి గ్రామానికి చెందిన ఎస్ రాజారావు (50) రోడ్డు దాటుతుండగా అతివేగంగా వస్తున్న ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ ఆయన తుది శ్వాస విడిచాడు.