వరుడిపై దాడి.. నిందితుడిని వెంబడించిన డ్రోన్
వివాహ వేదికపై వరుడిని కత్తితో పొడిచి చంపాలని యత్నించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. అమరావతిలో ఓ పెళ్లి మండపంలో జరుగుతున్న వేడుకకు ఇద్దరు వ్యక్తులు వచ్చి పెళ్లి కుమారుడిని కత్తితో పొడిచారు. అనంతరం వారు బైకుపై పారిపోతుండగా డ్రోన్ సాయంతో బంధువులు 2 కి.మీ. వరకు వెంబడించారు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం వరుడు చికిత్స పొందుతున్నాడు.