'ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలి'

'ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలి'

KRNL: ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పెద్ద హరివనం మండలం సాధన కమిటీ కన్వినర్ ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఆదోనిని జిల్లా చేయాలని కోరుతూ కర్నూలులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదోని ప్రజలు ఎన్నో ఏళ్లుగా జిల్లా కోసం ఎదురుచూస్తున్నారన్నారు.