అయ్యప్ప గుడి నిర్మాణానికి భారీ విరాళం
NLG: మున్సిపాలిటీలో నిర్మిస్తున్న అయ్యప్ప దేవాలయానికి దాతలు పెద్దమనసు చాటుకున్నారు. మొత్తం రూ.8 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు కోడి శ్రీనివాసులకు అందజేశారు. ఇందులో దశరథ రూ.2 లక్షలు, మరో నలుగురు తలో రూ.లక్ష, మరికొందరు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. దాతల సహకారంపై ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.