జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని అలుగునూర్ 8వ డివిజన్‌లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జనసేన పార్లమెంట్ కో ఆర్డినేటర్ రాజిరెడ్డి, నాయకుడు సిరిసిల్ల రాము హాజరయ్యారు. సభ్యత్వం పొందిన వారికి బాండ్లు అందజేశారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, అవయవ నష్టం జరిగితే రూ.2.5 లక్షల బీమా అందిస్తామని తెలిపారు.