ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను చేరుకోవాలి: కలెక్టర్

PDPL: ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను ప్రణాళిక బద్ధంగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో ఆయిల్ ఫామ్ లక్ష్యాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 2025-26 సంవత్సరంలో జిల్లాలో 2,500 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణ లక్ష్యం సాధనకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.