పాఠశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది: మంత్రి
AP: బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మైలవరం జడ్పీ స్కూల్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల విద్యపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. పాఠశాల విద్య బలోపేతానికి ఖాళీ పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.