యూరియా కొరతపై రైతుల రాస్తారోకో

యూరియా కొరతపై రైతుల రాస్తారోకో

WGL: నెక్కొండ మండలంలో యూరియా కొరతతో రైతులు శుక్రవారం నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు పట్టుబట్టారు. స్థానిక ఎస్సై మహేంద్ర సంఘటన స్థలానికి చేరుకొని రైతులను ఒప్పించి రాస్తారోకోను విరమింపజేశారు.