బూరుగడ్డ ఎవరికి అడ్డాగా మారుతుందో..?
SRPT: హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ -మాచవరం గ్రామంలో 2,595 ఓట్లు, 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ గతంలో సర్పంచ్‌గా చేసిన బీఆర్ఎస్ నాయకురాలు షేక్ సలీమా రంజాన్, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన యరగాని రాధా నాగరాజు మధ్యనే ఉండనుంది. బీసీ సామాజిక వర్గాలైన గౌడ్స్, యాదవ్ ఓట్లే దాదాపు సగం కంటే ఎక్కువ ఉన్నాయి. వారే నిర్ణాయత్మాకా ఓటుగా ఉండనున్నారని గ్రామస్థులు తెలిపారు.