నెల్లూరులో మొదలైన తుఫాన్ ప్రభావం
NLR: నెల్లూరులో ఉదయం నుంచే వర్షం మొదలైంది. దిత్వ తుఫాన్ ప్రభావం ఈ రోజు నుంచి సోమవారం వరకు కొనసాగనుంది. తుఫాన్ ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వెంకటాచలం, నెల్లూరు నగరంపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.