VIDEO: వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విషాదం

KMR: గణపతి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా కరెంటు షాక్ తగిలి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. NZB పెర్కిట్ నుంచి సిరిసిల్లకు గణపతి విగ్రహాన్ని తీసుకు వెళ్తుండగా పాల్వంచ మండలం ఆరేపల్లి శివారులో 11 కేవీ కేబుల్ తగిలి లక్ష్మీనారాయణ అనే యువకుడు మృతి చెందాడు. అలాగే మరొకరికి గాయాలయ్యాయి. అతన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.