పురుగు మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

పురుగు మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

NRML: భైంసా పట్టణంలోని బట్టిగల్లికి చెందిన అనంత్ వార్ ఆనంద్‌రావు (76) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై నాగభూషణం వివరాల ప్రకారం.. ఆనంద్ రావు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. మూర్ఛ సమస్య తీవ్రం అవడంతో మనస్తాపం చెంది శుక్రవారం మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.