మే 10 వరకు రుణాలకు దరఖాస్తులు

మే 10 వరకు రుణాలకు దరఖాస్తులు

అన్నమయ్య: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు కొరకు మే నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చిట్వేలు MPDO మోహన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. చిట్వేలు మండలంలోని షెడ్యూల్ కులానికి చెందినవారు 2025-26వ సంవత్సరానికి గాను రుణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని దృవపత్రాలను MPDO కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు.