ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు: ఏలేటి

TG: ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 40 కిలోల సంచి మీద 4 కిలోల ధాన్యాన్ని అధికంగా తూకం వేస్తున్నారని, ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళుతోందని ప్రశ్నించారు. ధాన్యం కుప్పమీద రైతు చనిపోతే రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఈ సమస్యను మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని పేర్కొన్నారు.