హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

KDP: సిద్ధవటలో 2022లో జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ కడప 7వ ADJ కోర్టు జడ్జి GS రమేష్ కుమార్ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. మతిస్థిమితం లేని మహిళ మాచుపల్లి గ్రామ రేణుక ఎల్లమాంబ గుడి వద్ద పడుకొని ఉండగా అత్యాచారం చేసి కత్తితో గాయపరచడంతో ఆమె మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు.