మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

సూర్యాపేట: మోతె మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రానున్న వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల నివేదికలను అడిగి తెలుసుకున్నారు.