గన్ పెట్టి లారీ డ్రైవర్ వద్ద డబ్బులు లాక్కున్న యువకులు
WGL: జిల్లాలో యువకుల ముఠా గన్‌తో బెదిరించి దారి దోపిడీలు చేస్తున్నారు. హైవేపై లారీలను టార్గెట్ చేసి డబ్బులు లాక్కున్నారు. ఓ లారీ డ్రైవర్‌కు పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించి డబ్బులు గుంజుకున్నారు. ఇవాళ డ్రైవర్ గాయాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.